PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూర్యభగవానుడికి..నమస్తుత్యే..

1 min read

– 28న ‘ఆర్క్’జయంతి (రథసప్తమి)
– 26 నుంచి 30 వరకు సూర్యదేవాలయ చతుర్థ వార్షికోత్సవం..
– శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి నేతృత్వంలో ఏర్పాట్లు ..
– కర్నూలు సూర్యదేవాలయం కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి వెల్లడి
నిత్యపూజలు..హోమం…అభిషేకాలు అందుకుంటున్న సూర్య భగవానుడు… ప్రపంచానికి వెలుగునిస్తూ… సకల ప్రాణికి ఆయురారోగ్యాలు….సిరిసంపదలను ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సూర్యభగవానుడి జయంతిని పురస్కరించుకుని.. ఈ నెల 28న (రథసప్తమి) అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సకల వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సకల జీవకోటికి ఆరాధ్యదేవుడిగా విరాజిల్లుతున్న సూర్యభగవానుడి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. కర్నూలు నడిబొడ్డున గుత్తి పెట్రోల్ బంకు దగ్గర 40 అడుగుల ఎత్తులో వెలిసిన సూర్యుడి దేవాలయం… ఓ వైపు బెంగుళూరుకు వెళ్లే వారిని… మరో వైపు హైదరాబాద్కు వెళ్లే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నెల 28న జరిగే రథసప్తమి వేడుకలకు శ్రీశ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
రథసప్తమి.. ఏడు జన్మల పాపం…తొలగు..సప్తమినాడు షష్ఠి తిథి ఉంటే.. షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈయోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.
గురువుకు.. రథ దానం…రథసప్తమినాడు బంగారముతోగాని, వెండితోగాని, రాగితోగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయవలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము. చతుర్థ వార్షికోత్సవానికి… ప్రత్యేక పూజలు26న ఉదయం 8 గంటలకు గోపూజ, గణపతి, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విక్ వరుణం,పంచగవ్య మేళనం, కలశ స్థాపన, మంత్ర పుష్పము. 9.30 గంటలకు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, 11 గంటలకు గణపతి, దత్త సంస్కృతి హోమం27న ఉదయం 7.30 గంటలకు శ్రీ గౌరీ అమ్మవారికి అభిషేకం, 9 గంటలకు లఘు శ్రీ చక్రనవావరణార్చన, 11 గంటలకు లలితా సహస్రనామ హోమం. సాయంత్రం శ్రీశ్రీ దత్త విజయానంద తీర్థ స్వాముల వారిని దేవాలయ ఆవరణలోకి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు.28న ఉదయం 6 గంటలకు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, 10 గంటలకు మహా సౌర హోమం. 29న సూర్యదేవుడికి అభిషేకం, పూజలు, 30న 7 గంటలకు సుబ్రహ్మణ్య అభిషేకం, 9 గంటలకు శ్రీ రాజశ్యామల నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీ రాజ శ్యామలా హోమం నిర్వహిస్తారు.సాయంత్రం ఆంజనేయ స్వామికి మన్యుసూక్త విధానంతో అభిషేకం, అరటి పండ్లతో అర్చన, తమలపాకులతో అర్చన, హనమాన్ చాలీసా ఉంటుంది.

About Author