ఉద్యమ నేతకు వందనం…. సామూహిక వివాహాలకు ఆహ్వానం
1 min read
మహాజన నేత మంద కృష్ణ మాదిగను ఆహ్వానించిన నిర్వాహకులు
ప్రశంసించిన నాయకుడు
హొళగుంద , న్యూస్ నేడు: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు… ఉద్యమ నేత…. మహాజన నాయకుడు మందకృష్ణ మాదిగ ను ఏప్రిల్ నెల 14వ తేదీన హొళగుందలో నిర్వహించనున్న సామూహిక వివాహాలకు హాజరుకావాలని ఆహ్వానించిన ఎమ్మార్పీఎస్ దళిత సంఘాల నేతలు వందనం సమర్పించారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను కలిసి సామూహిక వివాహాల ఆహ్వాన పత్రికను అందజేసిన సామూహిక వివాహ కార్యక్రమ నిర్వాహకులు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక వెసులుబాటును కలిగించేలా ఏప్రిల్ 14వ తేదీ హొళగుందలో నిర్వహిస్తున్న సామూహిక వివాహ కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ జయంతి రోజున పెళ్లి చేసుకునే నూతన జంటలను ఆశీర్వదించాలని కోరారు. అంబేద్కర్ జయంతి రోజున పెళ్లి చేసుకునే జంటలకు ఒక మధురానుభూతిగా నిలిచిపోతుందని అందులో భాగస్వాములు కావాలని కోరారు. ఇందుకు స్పందించిన మహా జననేత మందకృష్ణ మాదిగ అంబేద్కర్ జయంతి రోజు పెళ్లి చేయడం అనే ఒక మంచికి సంస్కృతికి సాంప్రదాయానికి తెర లేపారని ఇందుకు నిర్వాహకులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. వివాహ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ జయంతి రోజును ఒక పండుగలా నిర్వహించుకుందామని అందరితో కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు పంచ గుండుగా వెంకటేష్, కన్నారావు, మార్లమడికి రంగప్ప, దుర్గాప్రసాద్, మార్లమడికి రమేష్, అలేఖ్య విజయకుమార్, కురువల్లి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
