సాల్వేషన్ ఆర్మీ జూనియర్ హోమ్లిక్ ర్యాలీ
1 min read
ఆధ్యాత్మికత వృద్ధి చెందేలా తల్లిదండ్రులు,చిన్నారులు పట్ల శ్రద్ధ వహించాలి
సాల్వేషన్ ఆర్మీ కోర్ ఆఫీసర్ మేజర్ డి.రమణయ్య
పలువురిని ఆకట్టుకున్న బెనిత నృత్య ప్రదర్శన
అభినందించిన ఆర్మీ కోర్ ఆఫీసర్,సంఘ పెద్దలు, సంఘస్తులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : చిన్నారులను ప్రాథమిక స్థాయి నుంచి విద్య ఆధ్యాత్మిక అభివృద్ధి చెందేల చిన్నారుల పట్ల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బాధ్యతలు తీసుకొని నేర్పించాలని దెందులూరు సాల్వేషన్ ఆర్మీ కోర్ ఆఫీసర్ మేజర్ డి రమణయ్య అన్నారు.ఆదివారం దెందులూరు సాల్వేషన్ ఆర్మీ మెలీనియం చర్చిలో జూనియర్ హోమ్లి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు కుటుంబాలకు చెందిన చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆధ్యాత్మిక అభివృద్ధినీ ప్రబోధించేలా చిన్నారులతో పాటు అందరిని ఆకట్టుకునేలా నృత్య ప్రదర్శన చేసిన తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ పల్లె హర్షవర్ధన్ సిలువ కుమారి మనుమరాలు బెనిత ను. కోర్ ఆఫీసర్ మరియు సంఘ పెద్దలు, సంఘస్తులు అభినందించారు.