యూట్యూబ్ చానళ్ల పై సమంత కేసు !
1 min readపల్లెవెలుగు వెబ్: విడాకుల వ్యవహారంలో తన పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేశారంటూ ప్రముఖ హీరోయిన్ సమంత కోర్టుకెక్కారు. మూడు యూట్యూబ్ చానళ్లపై కూకట్ పల్లి కోర్టులో సమంత పరువు నష్టం కేసు దాఖలు చేసింది. కూకట్ పల్లి 15 ఏడీజే కోర్టులో ఆమె తరపు న్యాయవాది బాలాజీ పిటిషన్ దాఖలు చేయగా.. ప్రతివాదులకు నోటీసులు పంపని కారణంగా.. ఇతర టెక్నికల్ రీజన్స్ తో పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గురువారం మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు.