కోర్టు ముందు సమంత ఎక్కువేం కాదు !
1 min readపల్లెవెలుగు వెబ్: సోషల్ మీడియాలో తన వైవాహిక జీవితం పై అసత్య ప్రచారం చేశారంటూ ప్రముఖ నటి సమంత కోర్టును ఆశ్రయించారు. సమంత పిటిషన్ త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరపు లాయర్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి కోర్టు ముందు అందరూ సమానమేనని అన్నారు. కోర్టు ముందు సామాన్యులైన, సెలబ్రిటిలైన ఒక్కటేనన్నారు. కోర్టు సమయం చివరలో పిటిషన్ పై విచారణ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. తన పై దుష్ప్రచారం చేశారంటూ డాక్టర్ సీఎల్ వెంకట్రావుతో పాటు సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీల పై సమంత పరువు నష్టం దావా దాఖలు చేశారు.