PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమంతకు అరుదైన గౌరం.. దక్షిణాది తొలి సినీ నటిగా అవకాశం

1 min read


పల్లెవెలుగు వెబ్:
చైతూతో విడాకుల అనంతరం సమంత బిజీబిజీగా గడుపుతోంది. పూర్తిగా కెరీర్‌పై ఫోకస్ చేస్తూ.. వరుసబెట్టి సినిమాలకు సైన్ చేస్తోంది. రెమ్యూనరేషన్‌ను హైక్ చేసిందన్న టాక్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది. తాజాగా సామ్ ఓ అరుదైన అవకాశం దక్కించుకుంది. ఈ నెల గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమానికి స్పీకర్‏గా వ్యవహరించే అవకాశం సమంతను వరించింది. ఈ వేడుకలో స్పీకర్‏గా ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటిగా సమంత గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో జరగనుంది. మరోపక్క సామ్.. హాలిడే స్పాట్లలో స్నేహితులతో కలిసి తిరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది.

About Author