PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంబరమే సమరం…

1 min read

అశేష జనం మధ్య నూగ్గులాట ఉత్కంఠంగా సాగిన పిడకల సమరం

ఎట్టకేలకు దేవ దేవుడే గెలుపు..30 మందికి స్వల్ప గాయాలు

పల్లెవెలుగు వెబ్ ఆస్పరి: ప్రేమ వ్యవహారంలో వీరభద్ర స్వామి కాళికాదేవిల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో నిర్వహించే సాంప్రదాయం నూగ్గులాట బుధవారం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది కైరుప్పులలో సంబరమే సమరముగా మారింది రెండు వర్గాలుగా విడిపోయి గ్రామస్తులు ఒకరిపై ఒకరు విసురుకుని పిడకల సమరాన్ని దుమ్ము లేపారు. ఈ ప్రేమ సమరంలో దాదాపుగా 30 మందికి పైగా గాయాలయ్యాయి ఎప్పటిలాగానే దేవుళ్లకు సర్ది చెప్పడంతో ఈ తంతు ముగిసింది మండల పరిధిలోని కైరుప్పల గ్రామంలో పిడికల సమరం నూగ్గులాట అశేష జన వాహిని మధ్య ప్రశాంతంగా జరిగింది. శ్రీ వీరభద్ర స్వామి కాళికాదేవి ఉత్సవాల్లో భాగంగా పిడకల సమరం ఉత్కంఠ భరితంగా సాగింది. ఉదయం పూప్పలదొడ్డి,చెన్నంపల్లి,కైరుప్పుల గ్రామాల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం దేవుని విగ్రహాలను పల్లకిలో తీసుకొచ్చారు. కాళికాదేవి తరపున కొందరు వీరభద్ర స్వామి తరఫున మరికొందరు రెండు వర్గాలుగా విడిపోయి ప్రధాన రహదారిలో నూ గ్గులాటకు సిద్ధమయ్యారు. మేళ తాళాల తప్పిట్ల వేట కొడవలితో కారుమంచి గ్రామం నుండి రెడ్డి వంశికులు నరసింహారెడ్డి గుర్రంపై ఊరేగింపుగా కైరుప్పల గ్రామానికి వచ్చి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వెనక్కి తిరిగిపోయారు. పిడకల సమరం ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూశారు. ఉత్సవాల కోసం చేసిన పిడికిలను గ్రామస్తులు ఒకరిపై ఒకరు విసురుకున్నారు. పిడికిల బారి నుండి తమను రక్షించుకుంటూ ఎదురుదాడి చేస్తూ ఈలలు కేకలు తో ఆలయ ప్రాగణం మారి మోగింది. ఎట్టకేలకు దేవదేవుడు అయిన శ్రీ వీరభద్ర స్వామి వర్గీయులు దేవున్ని గెలిపించుకున్నారు. ఈ పిడికిల సమరం అరగంట సేపు సాగింది. ఈ సమరంలో 30 మందికి పైగా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలు పాలు అయినా భక్తులు ఆలయానికి వెళ్లి కాల్చిన పిడికిల బూడిదను గాయాలకు మందు గా పూసుకున్నారు. కాళికాదేవి వీరభద్ర స్వామి మధ్య ప్రేమ కోసం తలెత్తిన వివాదమే ఈ పిడికిల (నుగ్గులాట) ఉత్సవాలకు కారణం అయ్యింది. గ్రామస్తులు ఉగాది పండుగను పురస్కరించుకొని పిడికిల సమరాన్ని సంబరముగా జరుపుకుంటారు.  ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి, ఆధ్వర్యంలో 3సి ఐ లు60మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈ సర్పంచ్ తిమ్మక్క,ఎంపీటీసీ లక్ష్మి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బీటెక్ వీరభద్రి, లక్ష్మన్న , మల్లికార్జున, సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, శేషి రెడ్డి, ఉరుకుందప్ప, రంగన్న, అంగడి వీరభద్రి, వీరేష్, శీనప్ప,జీకే వీరేష్, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author