NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘సంబేపల్లి’ని కరువు మండలంగా ప్రకటించాలి

1 min read

 టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని సంబేపల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం  సంబేపల్లి మండల కేంద్రం  లో  మాజీ సర్పంచ్ నాగేశ్వర్ నాయుడు స్వగృహంలో. పాత్రికేయుల సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుడమిపై మొలకెత్తిన పంట వర్షపాతంతో నిలువునా ఎండింది.. సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందని కర్షకుల కష్టాలను తెలుసుకొనేందుకు రాయచోటి తెదేపా నియోజకవర్గ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కరవు మండలం గా ఎంపిక కాని సందర్భంగా సంబేపల్లి మండలం లో పర్యటించిన ట్లు ఆయన తెలిపారు.ఖరీఫ్ సీజన్ దాటిపోయిన వర్షం పడకపోవడంతో సంబేపల్లి మండల రైతులు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసి సంబేపల్లికి చుట్టుపక్కల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి సంబేపల్లికి మాత్రం మొండి చేయి చూపిందని ఆయన తెలిపారు.ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రభుత్వ అధికారులు సంబేపల్లి మండలంలో క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి స్థానిక పరిస్థితులను గమనించి కరువు మండలంగా ప్రకటించడానికి తగిన చర్యలు  తీసుకోవాలనిఆయనకోరారు.  , మండల టీ డీ పీ  నాయకులు మరియు అభిమానులు శాలువాలు కప్పి, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంబేపల్లి మండలాన్ని తక్షణం కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనంతరం మీడియాతో ఇష్టా గోష్టి  చర్చలో పాల్గొన్నారు…. ఈ కార్యక్రమంలో సంబేపల్లి మండల టిడిపి నాయకులు, బీసీ నాయకులు టీ డీ పీ కార్యకర్తలు  మరియు రైతులు, అభిమానులు తదితరులు  పాల్గొన్నారు.

About Author