సంబేపల్లి హైస్కూల్… 10 @ 10 గ్రేడ్ పాయింట్స్
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి : రాయచోటి నియోజకవర్గంలో ని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు చక్కటి ప్రతిభ కనపరిచారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి తెలిపారు . శనివారం ఆయన మాట్లాడుతూ పాఠశాలలోని 10వ తరగతి నందు 68 మంది విద్యార్థులకు గాను 53 మంది విద్యార్థులు 10 కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించారన్నారు . మిగిలిన విద్యార్థులలో ఏడు మంది 9.8 గ్రేడ్ పాయింట్లు, ఒకరికి 9.5 పాయింట్లు, ఇద్దరు 9 గ్రేడ్ పాయింట్లు, ఇద్దరు 8.2 గ్రేడ్ పాయింట్లు, ముగ్గురు 8 గ్రేడ్ పాయింట్లు సాధించడం జరిగిందన్నారు. హైస్కూల్ విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు కంటే మెరుగైన గ్రేడ్ పాయింట్లు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి గొప్ప ఫలితాలు సాధించడానికి కారణమైన విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయులు అభినందించారు.
కార్పోరేట్ పాఠశాలకు ధీటుగా..
ఆరు ఎకరాల సువిశాల మైదానం, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం , ఆధునిక భవనాలు, బాధ్యతగా పనిచేసే ఉపాధ్యాయులు , సాంకేతిక పరిజ్ఞానంతో బోధన, కార్పొరేట్ సౌకర్యాలు మా పాఠశాల సొంతం . పదవతరగతి ,ఇతర విద్యాసంబంధ అన్ని పోటీలలో కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాం. పాఠశాలకు వచ్చే పేద, బడుగు , బలహీనవర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాం.
— మడితాటి నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సంబేపల్లి, వైఎస్ఆర్ జిల్లా