ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈనెల 30న ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ చేయనున్నారు. ఇప్పటికే మూడు నెలల ఎక్స్ టెన్షన్ తో ఆయన ఉన్నారు. సమీర్ శర్మ కంటే ఆదిత్యానాథ్ దాస్ రెండేళ్ల జూనియర్. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ కొన్నేళ్లుగా కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సమీర్ శర్మ ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. అంత పెద్ద పోస్టులో ఉండి అకస్మాత్తుగా రాష్ట్ర కేడర్ కు రావడం చర్చనీయాంశంగా మారింది.