ఏపీ నూతన సీఎస్‌గా..సమీర్‌శర్మ బాధ్యతలు స్వీకరణ
1 min read
పల్లెవెలుగువెబ్, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ పదవీవిరమణ పొందిన నేపథ్యంతో ఆయన స్థానంలో ప్రభుత్వం నూతన సీఎస్‌గా సమీర్‌శర్మను నియమించిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆయన సచివాలయంలో నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. సమీర్‌శర్మ 1985బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన నియామక ఉత్తర్వులను ప్రభుత్వం సెప్టెంబర్ 10వ తేదీనే జారీ చేసింది.