రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కి… సంసద్ మహారత్న అవార్డు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: పార్లమెంటుతోపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అద్భుతమైన పనితీరును కనపర్చిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మకమైన 14 వ సంసద్ మహారత్న అవార్డును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందుకున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో శ్రీ టీజీ వెంకటేష్ గారు రవాణా , పర్యాటకం, జాతీయ రహదారులు, పౌర విమానయానం, రైల్వే భద్రత, సాంస్కృతిక శాఖలకు సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఈ ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు అందర్నీ ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే సంస్థ 2019 నుంచి 2022 వరకు ఈ ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అత్యుత్తమ సేవలందించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు ప్రతిష్టాత్మక సంసద్ మహారత్న అవార్డును ప్రకటించింది. 2022 -23 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డును కొత్త ఢిల్లీలోని న్యూ మహారాష్ట్ర సదన్ లో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగా ఇదే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుత చైర్మన్ ఎంపీ విజయసాయిరెడ్డి తో కలిసి శనివారం నాడు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందుకున్నారు . రాజ్యసభ సభ్యుడిగా ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మక సంసద్ మహారత్న అవార్డు అందుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు పలువురు ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.