శాంసంగ్ F22.. త్వరలో మార్కెట్లోకి
1 min readపల్లెవెలుగు వెబ్ : శాంసంగ్ బడ్జెట్ ధరలో మెరుగైన ఫీచర్స్ తో గెలాక్సి ఎఫ్ 22 మొబైల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో విడుదలైన శాంసంగ్ బడ్జెట్ మోడల్స్ తో పోల్చుకుంటే.. గెలాక్సి ఎఫ్ 22లో కీలకమైన మార్పులు చేశారు. ఇటీవల గెలాక్సి ఏ22 ను శాంసంగ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.
గెలాక్సీ ఎఫ్22 ఫీచర్స్ :
- ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1 ఓఎస్ తో పనిచేస్తుంది.
- 90hz రిఫ్రెష్ రేట్ తో 6.4 అంగుళాల హెచ్ డీ + ఎస్అమొలేటెడ్ ఇన్ఫినిటీ యూ డిస్ప్లే ఇస్తున్నారు.
- మీడియాటెక్ హీలియో జీ20 ప్రాసెసర్ ను ఉపయోగిస్తున్నారు.
- వెనుక వైపు 4, ముందు వైపు 1 కెమెరా ఉన్నాయి.
- 48 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు.. 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా..రెండు 2ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 13ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.
- ఈ ఫోన్ లో 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. 15 వాట్ యూఎస్బీ -సి టైప్ చార్జర్ ఇస్తున్నారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.