PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నూతన భవనం మంజూరు …డిసీసీ చైర్మన్

1 min read

సొసైటీల్లో రైతులు అకౌంట్ చేయండి -సొసైటీలో అన్ని పెద్దలకే పోతాయ్..పేదలకు రావడం లేదని ప్రశ్నించిన రైతులు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన పీరు సాహెబ్ పేట సహకార సొసైటీ ప్రాంగణంలో సోమవారం సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 70వ సహకార ముగింపు వారోత్సవాల్లో భాగంగా ముఖ్య అతిథులుగా కేడీసీసీ చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముందుగా మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ కార్యాలయం తరుగులో ఉన్నందున వర్షం పడితే నీళ్లన్నీ లోపలికి వస్తున్నాయని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని అదేవిధంగా గత 14 సంవత్సరాల నుండి సొసైటీ ప్రాంగణంలో ట్రాక్టర్ నిరుపయోగంలో ఉందని అన్నారు.గతంలో సహకార సొసైటీల పట్ల పల్లెల్లో చెడ్డపేరు ఉందని రైతుల్లో ఉన్న ఈ చెడ్డ పేరును తొలగించే విధంగా చూడాలని మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి అన్నారు.తండ్రికి తగ్గట్లుగా ముఖ్యమంత్రి రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారని రికార్డ్ స్థాయిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు జరిగాయని ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్నారు.ఇక్కడ అన్నీ పెద్ద లకు మాత్రమే అన్నీ వెళ్తున్నాయని పేదలకు మాత్రం ఏమీ రావడంలేదని చిన్న రైతులకు రుణాలు ఇవ్వాలని రైతులు చెరుకుచెర్ల ఉప సర్పంచ్ నారాయణరెడ్డి,ఉప్పలదడియ ఎల్లారెడ్డి అధికారులను ప్రశ్నించారు.తర్వాత కేడీసీసీ చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి మాట్లాడుతూ ఇక్కడ సహకార సొసైటీ కార్యాలయ నిర్మాణానికి మరియు పెట్రోల్ బంక్ కొరకు నిధులు మంజూరు చేస్తామని వెంటనే ప్రపోజల్ తయారు చేసి నాకు పంపిస్తే నేను అధికారులతో మాట్లాడి మంజూరు చేస్తానని అన్నారు.సొసైటీల ద్వారా ప్రతి రైతుకు  అకౌంట్ ఉండాలని మిగతా బ్యాంకుల కన్నా సొసైటీల ద్వారా రుణాలు అతి తక్కువ వడ్డీకే ఇస్తున్నామని రైతులు జీరో అకౌంట్ చేస్తే ప్రభుత్వమే భీమా చెల్లిస్తుందని అన్నారు. పొదుపు మహిళలు సంఘాలుగా ఏర్పడి సొసైటీలో అకౌంట్ చేసుకుంటే రుణాలు ఇస్తామని అంతేకాకుండా సొసైటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని నా సహకారం ఎల్లప్పుడూ రైతులకు ఉంటుందని నేనూ ఈ ప్రాంత వాసినే నాకు రైతుల కష్టాలు ఏంటో తెలుసని కేడీసీసీ చైర్మన్ అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల డిఆర్ శ్రీనివాసులు,డీజీఎం శివలీల,వైస్ ఎంపీపీ నబీ రసూల్,సొసైటీ సీఈఓ కృష్ణ కాంత్ వివిధ సొసైటీల చైర్మన్లు మరియు వివిధ గ్రామాల నాయకులు మరియు మహిళలు పాల్గొన్నారు.

About Author