NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పడకేసిన పారిశుద్ధ్యం.. గాడి తప్పిన అధికారుల పాలన..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: బిలకల గూడూరు గ్రామంలో  పారిశుద్ధ్యం లేక ఊరంతా దుర్గంధం ఎక్కడ చూసినా చెత్తచెదారం దోమలు ప్రబలడంతో గ్రామ ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు అసలే వేసవికాలం ఆపై సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న సమయంలో పైప్లైన్ ద్వారా ప్రజలకు అందించే మంచినీటి కుళాయిలు మురుగునీరులో తేలుతుండడంతో ప్రజలు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడే అవకాశం ఉందని గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పనితీరు నిర్లక్ష్యంగా ఉన్నట్టు రోజుకు ఒక సమస్యలతో ప్రజల ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన తీరు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి అనధికారికంగా కుళాయి కనెక్షన్లకు అధిక రుసుం తీసుకుంటున్నట్టు ప్రజల నుండి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి చెత్త సంపద కేంద్రం నిర్వహణ అటకెక్కినట్టు రోజు చెత్తా సేకరణ గ్రామమంతా పైప్ లైన్ లీకేజీలతో నీరు వృధా కావడం వేసవిలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనీసం చిన్న సమస్యలు కూడా పట్టించుకోవటం లేదని విధులకు సమయపాలన పాటించడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి తీరు మార్చుకోకపోతే స్పందనలో కలెక్టర్ కు తమ సమస్యల పై లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తామని గ్రామస్తులు తెలిపారు.

About Author