PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాల్లో పారిశుధ్యం… తాగునీటి పై దృష్టి పెట్టండి

1 min read

– ఎంపీడీవో విజయసింహారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: బుధవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లతో ఎంపీడీవో విజయసింహారెడ్డి సమావేశం నిర్వహించారు మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ తో జరిగిన సమావేశం లో చర్చించిన అంశాల మీద మరియు ఆదేశాల పై ఈ సమావేశంలో చర్చించారు ప్రతి గ్రామములో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని మురుగు కాల్వలు శుభ్ర పరచడానికి, చెత్త కుప్పలు ఎక్కడ పడితే వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్టు తెలిపారు వేసవికాలం మంచినీటి ఎద్దడి రాకుండా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు తాగునీటి సమస్య పై . క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందరు తప్పకుండా తమ గ్రామాలలో రోజువారి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు . గడివేముల మండలం( కూడా) క్రింద చేర్చినట్టు. ఇప్పటి వరకూ మండలము లో 753 ఇళ్ళ వరకు రిజిస్ట్రేషన్ అయ్యాయని. ఇక ముందు జరిగే జిల్లా కలెక్టర్ జరుపుబోయే సమావేశం నాటికి మీ లాగిన్ లో ఉన్న వాటిని జియో ట్యాగ్ చేసి స్టేజ్ కన్వర్షన్ లోకి తప్పకుండా మార్చాలని ఇంజనీర్ అసిస్టెంట్స్ లకు డిప్యూటీ ఇంజినీరింగ్ అధికారి శ్రీ సుబ్బారెడ్డి ఆదేశించారు. సచివాలయం సిబ్బంది అందరు తప్పకుండా అటెండెన్స్ ఉ. మరియు సా. బయోమెట్రిక్ వెయ్యాలని ఎంపిడిఓ తెలిపారు. అటెండెన్స్ వెయ్యని వారి పై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆలాగే ఈ నాలుగు రోజుల లో పీఎంజేఏవై . ఈ కేవైసీ పూర్తి చెయ్యాలని ఎస్ డి జి సర్వే కంప్లీట్ చెయ్యాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు ఎంపీడీవో విజయసింహారెడ్డి తెలిపారు. ఈ సమావేశం లో ఈఓఆర్డి ఖలీక్ , పంచాయితీ సెక్రటరీ లు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ . పీ అర్ ఏ ఈ పాల్గొన్నారు.

About Author