పారిశుద్ధ్యం… మెరుగు పడాలి
1 min read– మున్సిపల్ కమిషనర్ ఆర్. రాంబాబు
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : రాయచోటి పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు కొన్ని కఠిన నిర్ణయాలు, తీసుకోనున్నట్లు మున్సిపల్ కమీషనర్ తెలిపారు. చెత్తను తడి పొడిగా వేర్వేరు చేసి మున్సిపల్ కార్మికుల కు అందివ్వాలని ప్రజలను కోరారు. చెత్త మురుగు కాలువలు, రోడ్లు, ఖాళీ స్థలాల్లో పారవేస్తే భారీగా జరిమానాలు విధించండం తో పాటు, నోటీసు జారీ చేసి మున్సిపల్ చట్టాల ప్రకారం కోర్టు నందు దావా వేస్తామని అన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ప్రజలు మానివేయాలని కోరారు. రేపటి నుండి ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (CLAP)ప్రోగ్రామ్ ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కొరకు నడుం బిగించారని, అందులో భాగంగా అధికారులు, మున్సిపల్ కౌన్సిల్,ప్రజలు స్వచ్ఛరాయఛోటి ఏర్పాటు కు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ పెంచలప్ప, సిబ్బంది ,వార్డు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.