నగరమంతా ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
వ్యర్ధాలను పారిశుద్ధ్య సిబ్బందికే అప్పగించాలి
మురుగు కాలువలపై శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దు
కర్నూలు , న్యూస్ నేడు: బుధవారం నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశామని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని 52 వార్డుల్లో ప్రత్యేక సిబ్బందితో, జెసిబిలతో పూడికతీత పనులు చేపట్టామని, అలాగే హంద్రీ నదిలో పేర్కొన్న ముళ్లపొదల తొలగింపు పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయన్నారు. వెలువడిన వ్యర్థాలతో రాజ్ విహార్ ఎల్లమ్మ ఆలయం నుండి బుధవారపేట వరకు హంద్రీ తీరాన బండ్ రహదారి నిర్మాణానికి వినియోగిస్తున్నామని కమిషనర్ తెలిపారు. సుద్దవాగులో వ్యర్థాల తొలగింపు పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయని, తీసిన వ్యర్ధాలను సుద్దవాగు నుండి తరలిస్తున్నామని అన్నారు.నగర ప్రజలు సైతం నగరపాలకకు సహకరించి తమ ఇళ్ళలో వెలువడే వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బందికే అప్పగించాలని కమిషనర్ ప్రజలను కోరారు. వ్యర్థాలను మురుగు కాలువల్లో వేయరాదని, అలాగే వాటిపై శాశ్వత నిర్మాణాలు సైతం చేపట్టరాదని సూచించారు. తద్వారా పరిసర ప్రజలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. ఏవైనా పారిశుద్ధ్య సమస్యలుంటే నగరపాలక హెల్ప్ లైన్ నెంబర్ 7422992299 కు లేదా పురమిత్ర యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ సూచించారు.