సంజామల పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
1 min readపల్లెవెలుగు, వెబ్ నంద్యాల: ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ పరిసరాలను,పోలీస్ స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్, స్టేషన్ లో సీజ్ చేయబడిన వాహనాలను, లాకప్ గదులను మరియు కంప్యూటర్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. బీట్ లలో అప్రమత్తంగా ఉండాలని, స్టేషన్ పరిధిలో జరిగే రెగ్యులర్ క్రైమ్ పై ప్రత్యేక దృష్టి సారించి వాటి పూర్తిస్థాయి నియంత్రణ చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా స్థానిక ప్రజలతో సమన్వయం చేసుకుంటూ వారి ద్వారా సమాచారం సేకరిస్తూ తద్వారా నేరాలకు అడ్డుకట్టు వేయాలని తెలియజేశారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి యొక్క చట్టపరమైన సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని తెలియజేశారు.స్టేషన్ పరిధిలోని గ్రామాలలో శాంతి భద్రతల విషయంలో రాజి లేకుండా పనిచేయాలని అక్రమ మద్యం నాటు సారాయి గుట్కా మట్కా మొదలగు అసంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. సిబ్బంది ఎవరైనా బాధ్యత రాహితంగా వ్యవహరిస్తున్నట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడ బోమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి గారు సిసి ఫయాజ్ భాష గారు పాల్గొన్నారు.