డ్రగ్స్ ఎందుకు అలవాటు చేసుకున్నాడో చెప్పిన సంజయ్ దత్ !
1 min readపల్లెవెలుగువెబ్ : డ్రగ్స్ కి ఎందుకు అలవాటు పడ్డాడో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కేజీఎఫ్ విలన్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్. ‘అప్పట్లో నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా సిగ్గుగా ఉండేది. అయితే మరోవైపు వాళ్లకి నచ్చేలా ఉండడానికి ప్రయత్నించేవాడిని. దాని కోసం డ్రగ్స్ వాడితే వారికి కూల్‌గా కనిపించడమే కాకుండా, వారితో సులువుగా మాట్లాడే అవకాశం ఉంటుందని భావించా. అందుకే డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టా’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ అలవాటు నుంచి బయటపడాలని ప్రయత్నించిన సంజయ్ రిహబిలిటేషన్ సెంటర్‌కి వెళ్లాడు. ‘రిహబిలిటేషన్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత అందరూ నన్ను డ్రగ్గీ అనేవారు. ఆ మచ్చని పొగొట్టుకోవడానికి ఏదో చేయాలని భావించా. అందుకే చాలా కష్టపడి బాడీని బిల్డ్ చేసుకున్నా. అప్పటి నుంచి అందరూ నన్ను మెచ్చుకోవడం ప్రారంభించారు’ అని తెలిపాడు.