నీతికి నిజాయితీకి నిస్వార్థ ప్రజా సేవకి సంజీవయ్య జీవితం అంకితం ..
1 min read
పల్లెవెలుగు , ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణ నందలి హెచ్ బి ఎస్ కాలనీ లో గల పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందు స్వర్గీయ దామోదరం సంజీవయ్య 104వ జయంతిని జాతీయ సేవాస్తంబ్ జిల్లా ప్రతినిధి బై లుప్పల షఫీయుల్లా ముఖ్యఅతిథిగా పాల్గొని దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజాయితీకి మారు పేరైన జాతీయ నేత, జననేత, జాతీయ కాంగ్రెస్ రెండు పర్యాయాల జాతీయ అధ్యక్షులు, స్వర్గీయ దామోదరం సంజీవయ్య రాజకీయ జీవితం ప్రజాసేవకే అంకితం. ఎందరో ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. నిస్వార్థ ప్రజా సేవకుడు నీతి నిజాయితీకి నిలువుటద్దం, సంజీవయ్య జీవితం. సంజీవయ్య ముఖ్యమంత్రి అయ్యేనాటికి వారి కుటుంబానికి సంబంధించిన స్థితిగతులను పరిశీలించిన ఆనాటి బృందం సంజీవయ్య దుస్తులు, వంట సామాగ్రి, ఆయన పూరి ఇల్లు చూసి నిర్వేర పోయారు. తక్షణమే నిజాయితీగల దామోదరం సంజీవయ్య ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా జాతీయ కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. అనేక సేవా సహకార సంఘాల ప్రతిపాదించిన మేధావి దామోదరం సంజీవయ్య, తన జిల్లా వాసులకు అవసరమైన సాగునీటినీ సాగునీటిని అందించుటకు ఆనాడే గాజులదిన్నె ప్రాజెక్టును ప్రతిపాదించి పూర్తిచేసిన ఏకైక ప్రజాసేవకులు దామోదరం సంజీవయ్య . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ సంజీవయ్యగా, వృద్ధాప్య పెన్షన్ ప్రతిపాదించి సంజీవయ్యగా నేటికీ గుర్తుండిపోయారు. మంచితనానికి మారుపేరు దామోదరం సంజీవయ్య. ఆయన జన్మించిన స్థలమైన పెద్దపాడు గ్రామాన్ని ఆయన గృహాన్ని మ్యూజియంగా మార్చాలని, కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రతిపాదించాలని, మచ్చలేని మహానాయకుని జీవితం నేటి యువ నాయకులకు ఆదర్శం కావాలని వక్తలు బైలుప్పల షఫీయుల్లా, సంఘ సేవకులు కామలే గణేష్, విశ్రాంత ప్రజా పరిషత్ డివిజనల్ అధికారి కె మోహన్ రావు, పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు ఏనుగు బాల నరసన్న, ప్రతిభా భారతి, ఘన నివాళులు అర్పించి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బిస్కెట్లు చాక్లెట్లు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సేవా కార్యక్రమంలో ఎం మహానంది, యువరాజు, కుమ్మరి నాగరాజు, వెంకటేష్, ఆదిశేషు, సోమన్న, పాల్గొని దామోదరం సంజీవయ్య జీవితం నేటి రాజకీయ యువ నాయకులకు ఆదర్శం కావాలని కోరారు. దామోదరం సంజీవయ్య అమర్ రహే అమర్ రహే అమర్ రహే అంటూ నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో బైలుప్పల షఫీయుల్లా జాతీయ సేవాస్తంబ్ తదితరులు పాల్గొన్నారు.