PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదప్రజల సంజీవిని..డా: వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ..

1 min read

– ఒక్కో కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల ఉచిత చికిత్స..

– 6.33 లక్షల కుటుంబాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు..

– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయపరిమితి రూ. 25 లక్షలకు పెంచి మరింత మెరుగైన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు.   తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించడాన్ని,  ప్రతిఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ప్రారంభించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఏలూరు కలెక్టరేట్ లోని విసి హాలు నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి,  కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, జెడ్పి సిఇఓ కె.ఎస్.ఎస్. సుబ్బారావు, డిఎంహెచ్ ఓ డా. షర్మిష్ట, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ ఐ. రాజీవ్ పాల్గొన్నారు.  ఈ సందర్బంగా డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడంపై ప్రచురించిన అవగాహన కరపత్రాలను, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ఆవిష్కరించారు.  పలువురు లబ్దిదారులకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు, జిల్లా ఎప్పీ డి. మేరీ ప్రశాంతి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఆయా కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ కింది ఉచితంగా వైద్యం పొందడం, ఈ పధకం వల్ల కలిగే ప్రయోజనాలపై ఎఎన్ఎం, వాలంటీర్లు, సచివాలయసిబ్బంది, అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందే విధానం పై రూపొందించిన ప్రత్యేక యాప్ తో పాటు కుటుంబంలో కనీసం ఒకవ్యక్తి దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.  జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించుకున్నామన్నారు.  జనవరి నుంచి రెండవ విడత కార్యక్రమం ప్రారంభమౌతుందన్నారు. గ్రామం, పట్టణం, వార్డుల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 6.33 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డును అందించడం జరుగుతుందన్నారు.  వీటిని ఆయా ప్రాంతాల్లో సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయా కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.  రేపటి నుంచి గ్రామ స్ధాయిలో ఈ కార్యక్రమం ప్రారంభమౌతుందన్నారు.  కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లుడుతూ పేద ప్రజల ఆరోగ్య భధ్రతకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంతో దోహదపడుతుందన్నారు.  జిల్లా జనాభాలో 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందించడం జరుగుతుందన్నారు. సుమారు 3వేల 257 చికిత్సలను, 2285 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందే సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందన్నారు.  ప్రజలు ఆరోగ్యంపై ఎటువంటి ఆంధోళన చెందకుండా డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ భరోసా కల్పిస్తుందన్నారు.  రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు వైద్య రంగంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన సంస్కరణలను తీసుకువచ్చారన్నారు.  రాష్ట్రంలో ఎవరికీ ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా వాటిని ఆధికమించేందుకు వారిలో ధైర్యాన్ని, భరోసాను, ఆరోగ్యశ్రీ ద్వారా ముఖ్యమంత్రి కల్పిస్తున్నారన్నారు.  ఆరోగ్యశ్రీ కింది ఉచిత అడ్మిషన్, డాక్టరు సంప్రదింపులు, నర్సింగ్ సేవలు, అవసరమైన ఆధునిక వైద్య పరీక్షలు, అవసరమైన ఉచితంగా మందులు అందిచడమై కాకుండా ఆపరేషన్లు, శస్త్రచికిత్సలకు ఇంప్లాంట్లు, డిశ్చార్జి సమయంలో ఉచిత మందులు, తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ పధకంలో వైద్యం పొంది డిశ్చార్జి అయిన పిదప విశ్రాంతి సమయంలో జీవనోపాధి కోల్పోయే పరిస్ధితి కలగకుండా ఉండేందకు ఆరోగ్యశ్రీ ఆసర పధకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు.

About Author