PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీరామ్ నగర్ లో సంకల్ప యాత్ర..

1 min read

ఉమ్మడి కూటమి అభ్యర్థి  బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి పేర్కొన్నారు.. ఏలూరు 24,25 వ డివిజన్‌లో గురువారం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు.. ప్రతి ఇంటికి వెళ్ళి టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరించారు.. తన విజయానికి సహకరిస్తే ఏలూరు నగరంలో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏ అవసరం వచ్చినా తన స్థాయిలో తీర్చేందుకు కృషిచేస్తానని చెప్పారు.. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు నగరంలో గతంలో టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన ఐదేళ్ళలో ఎమ్మెల్యే ఆళ్ళ నాని చేసిన అభివృద్ధేమీ లేదని ఆరోపించారు.. 24వ డివిజన్‌లో రోడ్లన్నీ దివంగత బడేటి బుజ్జి హయాంలోనే వేసినట్లు స్థానికులు తెలుపుతున్నారని, అంతేకాకుండా స్థానిక ప్రజల సమస్యలు పరిష్కరించే విషయంలో కూడా ఎమ్మెల్యే దారుణంగా విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు.. రానున్న ఎన్నికల్లో వైసిపి ఘోర ఓటమి పాలవుతుందని ముందే గుర్తించిన సైకో జగన్‌ పింఛన్ల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు.. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసిన జగన్‌ పింఛన్లు పంపిణీ చేసేందుకు డబ్బులు లేక టిడిపి.పై దుష్ప్రాచారం చేస్తున్నారని ఆరోపించారు.. కూటమి అధికారంలోకి రాగానే ప్రతినెలా 1వ తేదీన లబ్దిదారులకు ఇళ్ళకు వచ్చి 4వేల రూపాయల పెన్షన్ సొమ్ము అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.. తన తండ్రి చావుకు సంబంధించి పూర్తిస్థాయి బహిరంగ చర్చకు రావాలని డాక్టర్‌ సునీత విసిరిన సవాల్‌ను సీఎం జగన్‌ స్వీకరించి, వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.. రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగిస్తున్న జగన్‌కు తగిన బుద్ది చెప్పేందుకు ప్రజలందరూ సిద్దమయ్యారని, త్వరలో జరిగే ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కవని ఆయన స్పష్టం చేశారు..ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ నాయకులు దోనేపూడి లోవరాజు,సరిది రాజేష్, బొత్స మధు,గౌరీ శంకర్, నూకల సాయి,జనసేన రవి, ఎమ్.డి.ప్రసాద్,కూనిశెట్టి మురళి, వెంకట రమణ, మేకా సాయి, అరవింద్, శ్రీరామ్, సోంబాబు, బుధ్ధా నాగేశ్వరరావు, కొణికి మహేష్,వాసా సాయి, నారాయణ కాళిదాసు, వాసు నాయుడు,గొడవర్తి నవీన్, కురెళ్ళ భాస్కర్, వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమా దుర్గ,గుదే నాగమణి 24,25,26 వ డివిజన్ల టీడీపీ ఇంచార్జీలు కడియాల విజయలక్ష్మి,మట్టా రంజిత్, చేకూరి గణేష్, టీడీపీ డివిజన్ నాయకులు ఆళ్ళ మోహన్, గణేష్,కావూరి జిన్నా, వేమూరి శ్రీధర్, కానాల శ్రీనివాస్,మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు,సోమిశెట్టి రాము మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author