PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు..

1 min read

– పాల్గొన్న ట్రెజరీ కార్యాలయల సిబ్బంది

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఏలూరు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ట్రెజరీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలను కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి ముగ్గులు పోటీలు, ఆటల పోటీలు పిల్లలతో పెద్దలతో రకరకాల ఆటల పోటీలను నిర్వహించారు. సబ్ ట్రెజరీ కార్యాలయాల సిబ్బంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో జిల్లా ట్రెజరీ కార్యాలయం సిబ్బంది కుటుంబ సభ్యులతో కార్యాలయంలో ఆహ్లాదకర వాతావరణంలో కన్నులు పండుగ జరిగింది. ఈ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి జిల్లా ట్రెజరీ అధికారి చేతుల మీదుగా మెమొంటోలను అందజేశారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

About Author