PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్రాంతి …సెలవు రోజుల్లో కూడా తరగతులు..

1 min read

సెలవు దినాలలో టీచర్స్ కి పనులు కనిపించరాదు

లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్

నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకొంటాం

ఆర్ ఐ ఓ చంద్రశేఖర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : నేటి నుండి జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అయితే కొంతమంది ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం సెలవు రోజుల్లో కూడా తరగతుల నిర్వహించడం లేదా సిబ్బంది చేత పని చేయించడం లేదా అడ్మిషన్ పేరుతో వీధుల వెంట తిప్పడం వర్క్ షాప్ పేరుతో సెలవు ఇవ్వవకుండా స్టాఫ్ వేధించడం పైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా ఇంటర్మీడియట్ ఆర్ ఐ ఓ చంద్రశేఖర్ కి  ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైవేటు టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ మరియు ఏలూరు టౌన్ యూనియన్ ఉపాధ్యక్షులు కే దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author