PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13న సంక్రాంతి ముగ్గుల పోటీలు..

1 min read

– నందికొట్కూరు నియోజకవర్గ రంగవల్లి పోటీలు
– జై జవాన్‌ పార్క్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీ లో సంక్రాంతి సంబరాలు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : రాష్ట్ర వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలను నందికొట్కూరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ కౌన్సిలర్ మందాడి వాణి తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూసంక్రాంతి సంబరాలలో భాగంగా 13న పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ జై జవాన్ పార్కు నందు మహిళల ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు మెదటి బహుమతి రూ.10,000. రెండవ బహుమతి రూ. 8,000. మూడవ బహుమతి రూ. 6,000. నాల్గవ బహుమతి రూ. 4,000. ఐదవ బహుమతి రూ.2,000.కన్సొలేషన్‌ బహుమతి కింద 20 మందికి రూ. 1,000 చొప్పున అందజేయనున్నట్లు తెలియజేశారు. నియమనిబందనలు.. కచ్చితముగా చుక్కల ముగ్గులకు మాత్రమే బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీలో పాల్గొనేవారికి ఒకరు మాత్రమే సహాయకులను అనుమతి ఉంటుందన్నారు.ముగ్గువేసే వారికి సంబందించిన ముగ్గుపొడి మరియు రంగులు ఇతరత్రాలు వారే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ముగ్గువేయడానికి నిర్ణీత సమయం 90 నిమిషములు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు . లాటరీ ద్వారా నిర్ణీతబాక్సులు ఏర్పాటు చేయబడుతుందన్నారు.ముగ్గులో ఎటువంటి పేర్లు రాయకూడదని సూచించారు.పోటీలో గెలుపొందిన విజేతలకు 14 వ తేది సాయంత్రం 4 గంటలకు శాప్‌చైర్మన్‌ శ బైరెడ్డిసిద్దార్థరెడ్డి గారి చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలది. పోటీలో పాల్గొనదలచిన మహిళలు సంప్రదించాల్సిన నెంబర్లు మున్సిపల్ వైస్ చైర్మన్ బొల్లెద్దుల ప్రశాంతి 9441006963, కౌన్సిలర్ మందడి వాణి 9490527556, చింతా తులశమ్మ 9963800371.

About Author