రాజ్యాంగం పై అవగాహన లేని సన్నాసి.. పవన్ పై నాని కామెంట్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చ గొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అని నిలదీశారు. అంబేద్కర్‌ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యమని… మంత్రి , ఎమ్మెల్యే ఇల్లులు కాదన్నారు. జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్ళంటూ మాజీ మంత్రి యెద్దేవా చేశారు.