సంస్కృతాన్ని కొనసాగించాలి… ఆపస్ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ న్యూ ఢిల్లీ : ఒకరో ఇద్దరో చదివే సబ్జెక్ట్స్ తో పోల్చి సుమారు 85 వేల మంది చదువుతున్న సంస్కృతాన్ని పాఠశాలల లో రద్దు చేయటాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్. శ్రావణ్ కుమార్, ఎస్. బాలాజీలు ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలలో సంస్కృతాన్ని కొనసాగించాలని అదేవిధంగా మిగిలిన అన్ని పాఠశాలల లో కూడా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని, భారతదేశ ప్రాచీన భాష సంస్కృతమని భారతీయతతో సంస్కృతానికి ఉన్న అనుబంధాన్ని ఎవరు విడదీయరదని దాన్ని ప్రస్తుత పాలకులు గుర్తించాలని వారు కోరారు. ఇటీవలఢిల్లీలో సంసద్ సంపర్క యోజన క్రింద వైయస్సార్సీపి పార్లమెంటరీ పార్టీ నాయకులు శ్రీ పి.వి.మిథున్ రెడ్డి గారిని కలిసినపుడు విజ్ఞప్తి చేశారు.