సంస్కృత అధ్యయన కేంద్రం ప్రారంభం…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ,న్యూ న్యూడిల్లీ మరియు జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్య్వర్యంలో సంస్కృత అధ్యయన కేంద్రం ప్రారంభించడం జరిగింది. అన్ని భాషలకు జనని అయినటువంటి సంస్కృతభాషను అందరూ నేర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారు (Certificate Couse) ప్రమాణపత్ర పాఠ్యక్రమాన్ని ప్రారంభించారు.జి.పుల్లారెడ్డి కళాశాలలో ఈ తరగతులు ప్రారంభమయ్యాయి.అత్యంత సులభమైన పధ్ధతిలో సంస్కృత వాతావరణంతో సంస్కృత మాధ్యమంలో సంస్కృతాన్ని బోధిస్తున్నారు. ఈ పాఠ్యక్రమంలో పాల్గోనాలనుకున్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. ఈ పాఠ్యక్రమం యొక్క రుసుము కేవలం 1500/-రూ. మాత్రమే. ఈ పాఠ్యక్రమానికి కావాల్సిన పుస్తకాలు అన్ని కూడా విశ్వవిద్యాలయంవారు అందజేస్తారు. మరియు . కేవలం కళాశాల విద్యార్ధులు మాత్రమే కాకుండా ఎవరైనా ఇందులో బయటవాళ్ళు ఎవరైనా చేరగలరు.ఈ పాఠ్యక్రమంలో కేవలం 15సం. వయసు పైగలవారు మాత్రమే చేరగలరు 15సం లోపువారు చేరడానికి కుదరదు. దీనికి సంబంధించిన తరగతులు ప్రతిదినం పుల్లారెడ్డి కళాశాలలో సాయంకాలం 4 గం. నుండి 5గం. వరకు మరియు కేశవ విద్యాలయంలో ప్రతి శనివారం 5గం. నుండి 7 గం. వరకు, ప్రతి ఆదివారం ఉదయం 10 గం నుండి 12 గం. వరకు జరుగుతాయి.అంతేకాకుండా జాతి,మతభేదాలు లేకుండా అందరూ సంస్కృతాన్ని రాయడం, చదవడం ,మాట్లాడడం నేర్చుకోవాలని విశ్వవిద్యాలయం యొక్క ఆశయం. ఈ పాఠ్యక్రమంలో చేరడానికి ఈ నెల 25వ తేది అంతిమ తేది. ఆసక్తి గలవారు సంస్కృత అధ్యాపకులైనటువంటి జి.సుబ్రహ్మణ్య ని సంప్రదించగలరు.: కురిడి సురేష్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్, శ్రీ మహాలక్ష్మి సంస్కృత భారతి జిల్లా అధ్యక్షురాలు, సుబ్రహ్మణ్యం నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ సంస్కృత ఆచార్యులు, శ్రీ గుబ్బా బాలస్వామి , సంస్కృత భారతి నగర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.