PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో..సంయుక్త మీనన్​ సందడి..

1 min read

జి.వి. మాల్​ను ప్రారంభించిన హీరోయిన్​

  • భారీ తరలివచ్చిన అభిమానులు

పల్లెవెలుగు, కర్నూలు:కర్నూలు నగరంలో విరుపాక్షి ఫ్రేమ్​ హీరోయిన్​ సంయుక్త మీనన్​ సందడి చేశారు. గురువారం జి.వి. మాల్​ను ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను చూసేందుకు ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. జి.వి.మాల్​ యజమాని ఉమామహేశ్వర్​ సమక్షంలో నగర మేయర్​ బి.వై. రామయ్య, హీరోయిన్​ సంయుక్త మీనన్​ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల జి.వి. మాల్​ షోరూంలు ప్రారంభించారని, ఇక్కడ నాణ్యమైన పట్టు వస్ర్తాలను తక్కువ ధరకు విక్రయించడం అభినందనీయమన్నారు. లోఫ్యాన్సీ శారీస్​, హ్యాండ్లూం, హోం ఫర్నిషింగ్​, 1 గ్రామ్​ జ్యువెలరీ పట్టు శారీస్​, హాఫ్​ శారీస్​, పట్టు లెహంగాస్​, కిడ్స్​ వేర్​ బాయ్స్​ అండ్​ గర్ల్స్​ , ఉమెన్​ వేర్​, జస్ట్​ బోర్న్​ తదితర వస్ర్తాలను అందుబాటు ధరలో సేల్​ చేస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా హీరోయిన్​ సంయక్త మీనన్​ కోరారు. అనంతరం మేయర్​ రామయ్య, జి.వి. మాల్​ షోరూం యజమాని ఉమామహేశ్వర్​ మాట్లాడుతూ  ఖమ్మం, గుడివాడ, రాజమండ్రి, మిర్యాలగూడ, కొత్తగూడెం, ఏలూరు, సత్తుపల్లి, జంగారెడ్డి తదతర షోరూంలను ప్రారంభించామని, అక్కడ ద్విగ్విజయంగా వ్యాపారం సాగుతోందన్నారు. వ్యాణిజ్యపరంగా కర్నూలు కూడా బాగా ఉందని, అందుకే ఇక్కడి ప్రజల అభిరుచికి తగ్గట్టు వస్ర్తాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు జి.వి. మాల్​కు వచ్చి ..అవసరమైన వస్ర్తాలను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మేయర్​ రామయ్య, జివి.మాల్​ యజమాని ఉమామహేశ్వర్​ కోరారు.

About Author