చౌటుకూరులో సారా విక్రేత అరెస్టు రిమాండ్
1 min readపల్లెవెలుగు కథనానికి స్పందన
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలంలో ఎక్కడైనా సరే సారా అమ్మడం,జూదం,బెల్టు షాపులపై దాడులు చేసి వీటిని గ్రామాల్లో పూర్తిగా కట్టడి చేస్తామని మిడుతూరు ఎస్ఐ ఎం.జగన్ మోహన్ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో ‘సారాయి అమ్మబడును స్టిక్కర్ హల్ చల్’అనే శీర్షికన బుధవారం పల్లె వెలుగు దిన పత్రికలో ప్రచురితమైంది.పల్లె వెలుగు దినపత్రికలో వచ్చిన కథనానికి ఎస్ఐ సారాయి అమ్ముతున్న వారిపై దాడులు చేశారు.ఎస్సై తెలిపిన వివరాల మేరకు బుధవారం చౌటుకూరులో సారాయి అమ్ముతున్న స్వాములు అనే వ్యక్తి వద్ద నుండి పది లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపినట్లు ఎస్సై తెలిపారు.మండలంలో ఎక్కడైనా సరే సారాయి పేకాట బెల్టు మద్యం వీటి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఒకవేళ ఇలాంటివి జరిగినట్లయితే తనకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.