PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సారా ఊటను ధ్వంసం చేస్తున్న సెబ్​ పోలీసులు

సారా ఊటను ధ్వంసం చేస్తున్న సెబ్​ పోలీసులు

పల్లెవెలుగువెబ్​, మహానంది: మండలంలోని గాజులపల్లి బుచ్చమ్మ తోట సమీపంలో ఆదివారం ఉదయం ఎనిమిది వందల లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు సెబ్​ సీఐ లలితాదేవి తెలిపారు. సారా తయారు చేస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో వెంటనే బట్టీపై దాడి చేశామని, తయారీదారులు పరారీ అయినట్లు ఆమె పేర్కొన్నారు. నాటుసారా తయారీ, అమ్మకం, విక్రయం వివరాలను తమకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా సెబ్​ సీఐ లలితా దేవి వెల్లడించారు. దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై కృష్ణ నాయక్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.

About Author