ఉరుకుంద ఈరన్న సన్నిధిలో కర్ణాటక శరణ్య స్వామి
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండలం లో ఉరుకుంద గ్రామంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నరసింహ ఈరన్న స్వామిని కర్ణాటక రాష్ట్రం కాటిగి తాలూకా దీవెనహళ్లి నాగన్న కళ్ళు గ్రామానికి చెందిన శరణ్య స్వామి శనివారం శ్రీ నరసింహ ఈరన్న సన్నిధిలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశ పరంపరంగా మేము రోగులకు మందులు ఇస్తామని అలాగే వైదిక రత్న మరియు పుణ్య ప్రవచనాలు కూడా భక్తులకు తెలుపుతామని ఇవన్నీ తెలుసుకున్న తమిళనాడు ప్రభుత్వం తనకు డాక్టరేట్ ప్రకటించిందని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు స్వామి వారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వదులుకుంటా పంపరెడ్డి తాత మరియు నాగిరెడ్డి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.