సీజనల్ హాస్టల్లో సరస్వతి పూజ…
1 min read
ఆనందంతో సంబరాలు చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు
విద్యార్థి దశలోనే క్రమశిక్షణ ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అలవర్చుకోవాలి!
ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు గుర్తు చేశారు
హొళగుంద , న్యూస్ నేడు: సీజనల్ హాస్టల్లో శనివారం సాయంత్రం సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు విద్యార్థి దశలోనే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థిని విద్యార్థులకు ఉషోదయ గ్రామీణ అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ నాగరాజు గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి పూజ అనేది ప్రతి ఒక్కరికి చిన్న దిక్సూచి లాంటిదే అని మీరందరూ భావించాలన్నారు. తల్లిదండ్రులు మనలాగా మన పిల్లలు కష్టపడకూడదు ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ కాలుపై తాము నిలబడి మనకు మంచి పేరు తేవాలని ఎంతో నమ్మకంతో మిమ్మల్ని పాఠశాలలకు పంపుతున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తులో గౌరవంగా బ్రతకవచ్చు అలా కాకుండా అల్లరిగా తిరిగితే చదువు మనకెందుకులే అనుకుంటే మనల్ని ఎవరు మార్చలేరు మన జీవితాలను మనమే మార్చుకోవాలని సూచించారు కష్టపడి ఇష్టంతో చదివి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు ఈ కార్యక్రమంలో సి ఆర్ ఎం టి లు తుకారం, రేణుక, ఉపాధ్యాయులు దుర్గయ్య, సోహెబ్, మహిళా నాయకులు హెచ్. లలిత ఉదయభాను, సీజనల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.