PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల అదుపులో సరయూ !

1 min read

పల్లెవెలుగువెబ్ : యూట్యూబర్‌ సరయూను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘7 ఆర్ట్స్‌’ పేరుతో ఆమె ఓ యూట్యూబ్‌ చానల్‌ నడుపుతున్నారు. తన వీడియోలతో యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగారు. ఆమె స్నేహితులు గత ఏడాది సిరిసిల్లలో సెవెన్‌ ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ హోటల్‌ ప్రమోషన్‌లో భాగంగా సరయూ ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. ‘గణపతి బప్పా మోరియా’ బ్యాండ్‌ను తలకు ధరించి.. దేవుడి బొమ్మలతో సరయూ, ఆమె స్నేహితులు మద్యం సేవించి హోటల్‌ను సందర్శించినట్లుగా ఆ లఘుచిత్రంలో ఉంది. యూట్యూబ్‌లో ఆ వీడియో వైరల్‌ అవ్వగా.. నెటిజన్లు సోషల్‌ మీడియాలో దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను, మహిళలను కించపరిచేలా ఆ లఘుచిత్రం ఉందని విమర్శించారు.

          

About Author