PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్దార్ వల్ల భాయ్​ పటేల్ సేవలు..చిరస్మరణీయం..

1 min read

కలెక్టర్ గిరీష  పి ఎస్ ఐ ఏ ఎస్

సర్దార్ పటేల్ ఆదర్శాలను గుర్తుంచుకోవాలి….

శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త మరియు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం వేడుకలు…

అన్నమయ్య జిల్లా బ్యూరో, పల్లె వెలుగు:సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ గిరీష పేర్కొన్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా… మంగళవారం ఉదయం జిల్లా పోలీస్ పర్యట గ్రౌండ్ నందు ఏక్తా రన్  కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ మాట్లాడుతూ…. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ప్రజలు ఎంతో ఆసక్తితో పాల్గొన్నారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్రానికి తర్వాత మన దేశానికి చేసిన సేవలను గుర్తుంచుకొని, ఆయన నడిచిన బాటలో మనమందరం నడవాలని ప్రజలకు సూచించారు. స్వాతంత్రం తరువాత మన దేశంలో ఉన్న 560 పైగా ఉన్న సంస్థానాలను ఒకటిగా చేసి భారతదేశాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఎంతో క్లిష్టమైన హైదరాబాద్ సంస్థానాన్ని ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో విలీనం చేసేందుకు ఆయన కృషి మరువలేని దానికి తెలిపారు. భారతదేశంలో స్టీల్ ఫ్రేమ్ గా పిలవబడే భారత సివిల్ సర్వీసెస్ దేశ నిర్మాణంలో మరియు పరిపాలనలో ముఖ్యపాత్ర పోషించగలుగుతున్నాయి అంటే అది సర్దార్ పటేల్ వల్లనే సాధ్యమైందని తెలిపారు. జిల్లా ఎస్పి కృష్ణారావు మాట్లాడుతూ… దేశ సమగ్రతను సమైక్యతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవ మరువలేనిదని, మనందరం కూడా మన జీవితంలో సమగ్రత మరియు సమైక్యత అనే భావాలను దృష్టిలో పెట్టుకొని జీవించాలని పిలుపునిచ్చారు. శాసనసభ వ్యవహారాల కర్త, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈరోజు దేశవ్యాప్తంగా దేశ సమగ్రతను సమైక్యతను గుర్తుంచుకునేందుకు యూనిటీ రన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శాలను కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజకమల్, మునిసిపల్ చైర్మన్ ఫయాజ్ భాష,  అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు, పాల్గొన్నారు.

About Author