సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతి.. ఘన నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని స్వాతంత్ర సమరయోధులు భారత మాత ముద్దుబిడ్డ రాజ్యాంగ హక్కుల కమిటీ చైర్మన్ భారతరత్న దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి నేడు 73వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి ఎం అమానుల్లా మాట్లాడుతూ భారత దేశపు ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. స్వాతంత్రం లభించిన తర్వాత అనేక సంస్థానాలను దేశంలో విలీనం చేయడానికి కృషి చేసిన వారిలో ప్రముఖులు. భారతదేశ మొట్టమొదటి కాంగ్రెస్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మంత్రి మండలి లో హోం మంత్రి మరియు ఉప ప్రధాని పదవులు చేపట్టిన సర్దార్ గారు. 1931లో కరాచీలో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు దేశానికి స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగ రచనకు ఏర్పడిన కమిటీకి సహకారం అందించారు భారత ప్రభుత్వం దివంగత కాంగ్రెస్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తించి భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న బిరుదును ప్రకటించింది. చరిత్ర పురుషుడిని స్మరించుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హెచ్ పరసప. చాకలి వెంకటేష్ బోయా సుధాకర్ కరిడి వెంకటేష్ రాజు బోయ మల్లేసి బోయ సిద్ధమల్ల ఎరుకుల బసవ కురువ నాగరాజు ముస్తఫా హసేన్ మురళి వడ్డే భీమ బోయ రామదాసు అనేకమంది కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొని మహనీయులకు నివాళులు అర్పించడం జరిగింది.