సర్దార్ వల్లభాయి పటేల్ కృషి అమోఘం
1 min read– జాతి సమైక్యత ప్రతి ఒక్కరి బాధ్యత…
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జాతి సమైక్యత కోసం సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషి అమోఘమని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ,మున్సిపల్ కమిషనర్ కిషోర్ లు పేర్కొన్నారు. మంగళవారం నవభారత నిర్మాత, దార్శికనేత, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు.అనంతరం చైర్మన్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జాతి సమైక్యత ప్రతి ఒక్కరి బాధ్యతఅని అన్నారు . సర్దార్ వల్లభాయి పటేల్ స్వాతంత్ర్య యోధుడుగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం దేశంలోని వందలాది సంస్థానాలు ఒకటిగా విలీనం కావడానికి గట్టిగా కృషి చేసి సపలుడైన వీరుడన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేఖంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారన్నారు. రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీ చైర్మన్ గా పటేల్ వ్యవహరించారన్నారు. భారత జాతి ఐక్యతకు కృషిచేసిన మహనీయుల త్యాగాలును ఆయన స్మరించారు. ప్రాంతీయ విబేధాలు సృష్టించి ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టి, స్వార్థ పూరిత కుట్రలను పటేల్ స్ఫూర్తిగా తిప్పికొట్టడమే ఆ దేశభక్తుడికి మనమందించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, పట్టణ ఉపాధ్యక్షులు చింతా విజ్జి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్, కౌన్సిలర్ లు హమీద్ మియ్య, చాంద్ భాష, షేక్ నాయబ్, లాలు ప్రసాద్, అల్లూరి క్రిష్ణ, సమీరా భాను, రాధిక, కృష్ణవేణి, వైసీపీ జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షుడు బొల్లెద్దుల రామక్రిష్ణ, వైసీపీ నాయకులు గోవింద రెడ్డి, వి.ఆర్ శ్రీను, బ్రాహ్మయ్య ఆచారి తదీతరులు పాల్గొన్నారు.