PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సరిగమప ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే..మే 14న మీ జీ తెలుగులో!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సంగీత ప్రయాణంలో 14వ సీజన్ ప్రారంభమైన సరిగమప ఛాంపియన్ షిప్ తుదిపోరుకు సిద్ధమైంది. ఈ ఆదివారం, మే 14న ప్రసారం కానున్న సరిగమప ఛాంపియన్ షిప్ గ్రాండ్ ఫినాలేలో విజేతలెవరో తేలిపోనుంది. ఛాంపియన్స్ మధ్య జరుగుతున్న ఈ పోరులో టైటిల్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానున్న సరిగమప ఛాంపియన్షిప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ని తప్పక చూడండి, మీ జీ తెలుగులో!. ఎనర్జిటిక్ యాంకర్ ప్రదీప్ పంచ్లు, ముచ్చటైన ముగ్గురు జడ్జిల కామెంట్స్తో ఈ ఫినాలే ఎపిసోడ్ వినోదం పంచనుంది. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో విజేత ఎవరో ప్రకటించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు మెలొడీ బ్రహ్మ మణిశర్మ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అంతేకాదు ఈ సంగీత ప్రయాణ చివరి అంకంలో ‘అన్నీ మంచి శకునములే’, ‘ఉగ్రం’ చిత్రబృందాలు కూడా పాల్గొని కంటెస్టెంట్స్ ని ఉత్సాహపరిచాయి. ఈ ఎపిసోడ్లో కామెడీ హీరో అల్లరి నరేష్ ‘ఇంకీ పింకీ పాంకీ..’ పాటపాడి నవ్వులు పూయించారు. హృదయాలను హత్తుకునే పాటలతో సాగే ఈ సంగ్రామంలో నెగ్గి విజేతగా నిలిచిన సరిగమప ఛాంపియన్ షిప్ టైటిల్ విన్నర్ ను మణిశర్మ ప్రకటిస్తారు.

About Author