PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతుల పక్షాన తలముడిపి సర్పంచ్

1 min read

– రైతులకు ఖాళీ గోనె సంచుల పంపిణీ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు:రైతులకు వెన్నుదన్నుగా నిలబడి రైతులకు గతంలో జరిగినటువంటి అన్యాయంపై రైతుల పక్షాన నేనున్నానంటూ జరిగిన అక్రమాలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు రావాల్సిన వాటిని రప్పించుటకు తీవ్రంగా కృషి చేసిన తలముడిపి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు శ్రమ అంతా ఇంతా కాదనే చెప్పవచ్చు.వివరాల్లోకి వెళితే 2020-21 సంవత్సరంలో ఖరీఫ్ రైతుల వద్ద నుండి నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్,నందికొట్కూరు సహకార సొసైటీ,మిడుతూరు మహిళా మండలి సమాఖ్య వారు మొక్కజొన్నలను గ్రామంలో అధికారులు కొనుగోలు చేశారు.అప్పట్లో రైతులకు కాళీ గోనే సంచులను తిరిగి ఇవ్వాలి.కానీ అధికారులు గోనే సంచులను ఇవ్వలేదు.ఈవిషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పోగుల.వెంకటేశ్వర్లు రైతులతో కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.స్పందించిన కలెక్టర్ గ్రామంలో విచారణ చేయించారు.రైతులకు సంచులను ఇవ్వలేదని వాస్తవమని తేలడంతో మార్కెట్ కమిటీ నుంచి 22వేల సంచులు,మిడుతూరు మహిళా మండల సమాఖ్య నుంచి 3,300 సంచులు,నందికొట్కూరు సహకార సొసైటీ నుంచి 2,500 సంచులు ఇలా మొత్తం 27,596 సంచులను గ్రామంలో ఉన్న 200 మంది రైతులకు గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సంచులను పంపిణీ చేసినట్లు సర్పంచ్ తెలిపారు.రైతులకు సంచులు వచ్చే విధంగా కృషిచేసిన సర్పంచ్ ను రైతులు అభినందించారు. ఈకార్యక్రమంలో వంగాల.సీతారామిరెడ్డి,అంకిరెడ్డి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author