NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న సర్పంచ్..

1 min read

– ఉపాధి పని లేక అగచాట్లు పడుతున్న కూలీలు..అధికారులకు వినతి పత్రం అందజేసిన
– హస్తకళల బోర్డు డైరెక్టర్ సూర్యనారాయణ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో 2022-2023 సంవత్సరానికి గాను సంబంధించిన ఉపాధి హామీ పనులు లేక పూట గడవడం కష్టంగా ఉండి ఇబ్బందుల గురవుతున్నారు. స్థానిక సర్పంచ్ పనులకు అడ్డుకుంటున్నారని, దీంతో కొత్తూరు గ్రామంలో ఉపాధి పనులు లేక ఉపాధి కోసం ఇతర గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో కూలీ నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్లిన ఆటో ప్రమాదానికి గురైయ్యింది. ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి, కొత్తూరు మాజీ సర్పంచ్ భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్నా సర్పంచ్ సాకులు చూపిస్తూ నిమ్మకు నీరేత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడు. దీనిపై స్పందించిన కొత్తూరు మాజీ సర్పంచ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళలబోర్డు డైరెక్టర్ సూర్యనారాయణ మాస్టారు ఏలూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.

About Author