PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రీడాకారులకు సర్పంచ్ జనార్దన్ క్రీడా దుస్తులు పంపిణి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కబడ్డీ క్రీడాకారిణిలకు శుక్రవారం శాతనకోట గ్రామ సర్పంచ్ జనార్దన్ గౌడు  క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో  తమ వంతుగా క్రీడలకు ప్రోత్సాహం అందించాలనే ఉదేశ్యంతో క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.   గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు తన వంతు సహకారాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత ,వైసిపి నాయకులు ఓంకార్ రెడ్డి, జంగం పాడు రాజు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author