NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌ర్పంచ్ ప‌ద‌వి వేలం.. ధ‌ర రూ. 44 ల‌క్ష‌లు !

1 min read
                                    

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఓ గ్రామ ప్ర‌జ‌లు వినూత్నంగా స‌ర్పంచ్ ను ఎన్నుకున్నారు. ఓటుతో కాకుండా నోటుతో స‌ర్పంచ్ ను ఎంపిక చేశారు. ప‌ద‌వి కోసం పోటీ ప‌డ్డవారు వేలంలో పాల్గొన్నారు. అశోక్ న‌గ‌ర్ జిల్లా భ‌తౌలి గ్రామ ప్ర‌జ‌లు త‌మ స‌ర్పంచ్ ను ఎన్నుకునేందుకు వేలం పాట నిర్వ‌హించారు. ఈ వేలం పాట‌లో మొత్తం ఐదుగురు వ్య‌క్తులు పాల్గొన్నారు. వీరిలో సాభాగ్ సింగ్ యాద‌వ్ అనే వ్య‌క్తి వేలంలో స‌ర్పంచ్ ప‌ద‌విని గెలుచుకున్నాడు. 21ల‌క్ష‌ల‌తో ప్రారంభ‌మైన వేలం పాట‌.. 44 ల‌క్ష‌ల‌కు ముగిసింది. అయితే.. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల మేర‌కు ఎన్నికైన వ్య‌క్తినే స‌ర్పంచ్ గా గుర్తిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.

About Author