తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించిన సర్పంచ్
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : చింతలపూడి నియోజకవర్గం ప్రగడవరం గ్రామంలో ఆగస్టు 1 వ తేదీ నుండి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా, చింతలపూడి మండలం ప్రగడవరంలో తల్లిపాల వారోత్సవాలను ప్రగడవరం సర్పంచ్ తోమ్మండ్రు భూపతి ప్రారంభించారు.ఈ సందర్భంగా భూపతి మాట్లాడుతూబిడ్డ పుట్టిన గంటలోపే నవజాత శిశువుకు తల్లి పాలిచ్చేల చూడాలన్నారు. ఆ విధంగా తల్లి సాయం చేయాలన్నదే వారోత్సవాల ముఖ్య ఉద్దేశం. అన్నారు. అమ్మపాలు అమృతం, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి మరియు వ్యాధి నిరోధక శక్తికి తల్లిపాలు ఎంతగానో దోహదపడతాయన్నరు. సహజ సిద్ధంగా లభించే తల్లి పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయని తల్లికి కూడా ఆరోగ్యంతో పాటు మానసిక స్థితి, ఒత్తిడికి లోను కాకుండా శరీరం సహజ సిద్ధంగా త్వరగ తిన తయారవ్వటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్త్రీ మాతృత్వాన్ని బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా నవజాత శిశువు ఎదుగుదలకు వారి బంధం దగ్గర అవటానికి సంబంధం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగనవాడి సెక్టార్ సూపర్వైజర్ కె కమలాభాయ్, డాక్టర్:డి భరత్, ప్రగడవరం టీచర్ సుబ్బలక్ష్మి , శాంత కుమారి మరియు కవిత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.