ఇరిగేషన్ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన సర్పంచ్ భర్త..!
1 min read– ఫిర్యాదు చేసిన పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
– ప్రభుత్వ ఆస్తిని కాపాడడానికి స్పందనలో ఫిర్యాదు చేశా..
ఎంపీటీసీ గెడ్డం సుజాత
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఇరిగేషన్ భూమిని ఆక్రమించిన వైసిపి సర్పంచ్ భర్త శ్రీనివాస్ పై చర్యలు తీసుకోండిస్పదనలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసినపినకడిమి వైసిపి ఎమ్ పిటిసి గెడ్డం సుజాత దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండలంపినకడిమి గ్రామంలోని ఆర్ యస్ నెం.181, 182, 185, 186 నెంబర్లు దాఖలా య. 2-50 సెంట్లు ప్రభుత్వ ఇరిగేషన్ భూమిని ఆక్రమించి, అక్రమంగా బోరు వేసి, కొబ్బరి మొక్కలు వేసి సదరు భూమిలో చదును చేసి మట్టిని, ఇసుకను అమ్ముకుంటున్న గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు, సర్పంచ్ భర్త పలగాని శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని పెదవేగి మండలం పినకడిమి ఎమ్ పిటిసి గెడ్డం సుజాత సోమవారం ఉదయం కలక్టరేట్ లోని స్పందన కార్యక్రమంలో పిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని – ప్రభుత్వ భూమిని కబ్జా కోరల నుండి కాపాడాలని కోరారు. గ్రామ ఎమ్ పిటిసి సుజాత గ్రామ విఆర్ఓకి, పెదవేగి మండల తహశీల్దార్ కి ఫిర్యాదు చేయగా సదరు రెవిన్యూ అధికారులు ఏవిధమైన చర్యలు తీసుకోలేదని, తమ పరిధి కాదని, సదరు శ్రీనివాస్ ఆక్రమించుకున్న ఇరిగేషన్ భూమి య.2-50ట్లు ఆక్రమంగా సాగు చేస్తున్న భూమిని కాపాడాలని, ప్రభుత్వ ఆస్థిని కాజేయుచున్న సదరు శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్ పిటిసి విజ్ఞప్తి చేశారు.