పునీత్ పేరిట శాటిలైట్.. విద్యార్థుల ప్రయోగం
1 min readపల్లెవెలుగువెబ్ : కన్నడ నటుడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ పేరిట శాటిలైట్ ఏర్పాటుకు కన్నడ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బెంగళూరు మల్లేశ్వరంలోని పీయూ కళాశాలలో నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరానికి చెందిన విద్యార్థుల ద్వారానే ఉపగ్రహాన్ని తయారుచేస్తామని తెలిపారు. ఇందుకోసం ఐటీబీటీ శాఖ ద్వారా రూ.1.90 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి అశ్వర్థనారాయణ తెలిపారు. సెప్టెంబరు లేదా అక్టోబరులో ప్రయోగించే రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతామని.. 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రాజెక్టులో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కిలో బరువున్న శాటిలైట్‌ను రూ.1.90 కోట్లతో విద్యార్థులే రూపొందిస్తారని వివరించారు.