సమాజసేవతోనే సంతృప్తి – మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : సమాజ సేవతోనే సంతృప్తి కలుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ప్రతి వ్యక్తీ తన సంపాదనలో కొంత శాతం సమాజ సేవకు వినియోగిస్తే దేశం పురోగతి సాధిస్తుందని ఆయన అన్నారు. నూతనంగా ప్రారంభించిన ఆయత్ ఫౌండేషన్ సేవా సంస్థ లోగోను తన నివాసంలో ఆవిష్కరించిన సందర్బంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సమాజాన్ని తన కుటుంబంలా భావించినప్పుడే ప్రగతి ఫలాలు అందుతాయని అన్నారు. పోలీసు శాఖలో విశేష సేవలు అందించిన రిటైర్డ్ డియస్పీ మహబూబ్ బాషా సమాజసేవా రంగంలోకి రావడం అభినందనీయమని అన్నారు. ఆయత్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ ఒక మంచి సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో తాము ఈ సంస్థను ప్రారంభించామని అన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా రాబోయే తరాల కోసం ఒక వినూత్న ప్రణాళికతో తమ కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఆనందరావు, రామమోహన్ రెడ్డి, వెంకట్రాముడు, నాగేశ్వరబాబు, సూర్యకుమార్, జ్యోతిరాణి తదితరులు పాల్గొన్నారు.