‘కోవిడ్’ బాధితులకు వైద్య సేవలపై సంతృప్తి
1 min read– ప్రత్యేక అధికారిణి పద్మజ
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : పట్టణంలోని అమరావతి ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్య చికిత్సలపై ప్రత్యేక అధికారిణి పద్మజ సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసదుపాయాలు, మధ్యాహ్నం భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు, పౌష్టికాహారం అందించాలని సూచించారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నప్పటికి రోజు కడపకు వెళ్లి తీసుకురావలంటే సమస్యగా ఉందని హాస్పిటల్ యం డి ప్రవీణ్ కుమార్ రాజు కోవిడ్ ప్రత్యేక అధికారిని పద్మజ దృష్టికి తీసుకొచ్చారు. ఆమె వెంట స్థానికి సీడీపీవో వసంత బాయి,అమరావతి కోవిడ్ నోడల్ ఆఫీసర్ దివాకర్ తో తో పాటు అమరావతి హాస్పిటల్ యం డి ప్రావీణ్ కుమార్ రాజు వారి సిబ్బంది వున్నారు.