NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల దాహార్తిని తీర్చడం ఎంతో పుణ్యకార్యం

1 min read

మానవత స్వచ్ఛంద సేవ సంస్థ మండల శాఖ అధ్యక్షులు- జి ఎన్ భాస్కర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండుటి వేసవిలో ప్రజలకు మంచినీరు ఇచ్చి వారి దాహార్తిని తీర్చడం ఎంతో పుణ్య కార్యమని మానవత స్వచ్ఛంద సేవ సంస్థ మండల శాఖ అధ్యక్షులు జి ఎన్ భాస్కర్ రెడ్డి అన్నారు, శనివారం స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సమీపంలోని జీ వై కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ నిర్వాహకులు జీ వై అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సుత్తి చేసిన మంచి నీటి జల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కడ చూసినా త్రాగునీటితో వ్యాపారం చేసే ఈ రోజుల్లో ఉచితంగా ప్రజలకు శుద్ధిచేసిన మంచి నీటిని అందించడం ఎంతో శుభపరిణామమని, ఈ మంచి కార్యానికి శ్రీకారం చుట్టిన జీవై కాంప్లెక్స్ నిర్వాహకులు జీ వై అన్వేష్ రెడ్డి నీ ఆయన అభినందించారు, ఈ కాంప్లెక్స్ కొత్త రోడ్డు నుండి పాత రోడ్డు వరకు ప్రధాన రహదారి కావడం, అలాగే ఈ కాంప్లెక్స్ చుట్టుపక్కల వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, మీసేవ కేంద్రాలు ఉండడంతో అటు ప్రయాణికులకు, ఇటు బాటసారులకు, వివిధ పనుల మీద వచ్చే వినియోగదారులకు ఈ శుద్ధి చేసిన ఉచిత మంచినీటి సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు, అదేవిధంగా మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ప్రధాన కూడళ్లలో ప్రయాణికులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే చాలా మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు, ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ దుకాణదారులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author