NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈ నెల 26న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  ఈ నెల 26, ఆదివారం సాయంత్రం 4-00 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు లలితా పీఠం సంయుక్త నిర్వహణలో కర్నూలు పాత పట్టణంలోని లలితా పీఠం ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం మరియు కార్తిక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మరియు లలితా పీఠం పీఠాధిపతులు గురు మేడా సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను లలితాపీఠం నందు ఆవిష్కరించారు. సామూహికంగా చేసే కార్యక్రమాలకు అత్యంత ప్రభావవంతమైన శక్తి ఉత్వన్నమై జాతితో పాటు జగతికి కూడా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ, అనంత అనిల్ కుమార్, దాసరి రామచంద్రారెడ్డి, ధార్మిక సంస్థల ప్రతినిధులు పూడూరు లక్ష్మీ రెడ్డి, కె.రామాంజనేయులు, తల్లం సురేశ్, నరసప్ప, బొగ్గుల శివారెడ్డి, తెళ్ళాకుల వేదవతి , రాధాకృష్ణ ఇంద్రావతమ్మ, బాలస్వామి, ఉమాదేవి, అర్చకులు విభూతి లోకేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.


About Author